TDP మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు వద్దు - జగన్|AP CM Not Interested In officers Who Worked With TDP

2019-06-28 129

AP Chief Minister YS Jaganmohan Reddy has instructed the ministers of the Telugu Desam government not to take back any of the ministers' staff in the same posts or under any other key responsibilities. Many of them served as Officers on Special Duty, Private Secretaries, Additional Private Secretaries and Personal Assistants in the offices of the the TDP Ministers. They all said they would not be given the opportunity to work with Cabinet ministers again.
#ysjaganmohanreddy
#staff
#ministers
#AP
#ycp
#tdp
#chandrababu

టిడిపి హయాంలో పనిచేసిన పిఎస్, పిఓ, ఓఎస్డీ లకు షాక్ ఇచ్చారు ఏపీ సీఎం వైయస్ జగన్. గత ఎన్నికల్లో టి.డి.పి ఓటమి పాలు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వైసిపి మంత్రుల వద్ద గతంలో తాము చేసిన పోస్టులలోనే కొనసాగాలన్న ఉద్దేశంతో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బంది ఎవరినీ తిరిగి అదే పోస్టుల్లో లేదా వేరే కీలక బాధ్యతల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అప్పటి మంత్రుల కార్యాలయాల్లో ఆఫీసర్స్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ, ప్రైవేట్‌ కార్యదర్శులు, అదనపు ప్రైవేట్‌ కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులుగా పలువురు పనిచేశారు. ఇక వారందరికీ మళ్ళీ క్యాబినెట్ మంత్రుల వద్ద పని చేసే అవకాశం ఇవ్వరాదని తేల్చి చెప్పేశారు.

Free Traffic Exchange

Videos similaires